CRIMEDISTRICTS

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో రెండు కేసులు నమోదు

నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కాకాణి అసభ్య వ్యాఖ్యలు చేశారని నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.ఈ కేసుల్లో నోటీసులు ఇచ్చేందుకు నగరంలోని కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసానికి దర్గామిట్ట పోలీసులు చేరుకున్నారు. అయితే, నోటీసులు తీసుకునేందుకు మొదట కాకాణి నిరాకరిస్తూ, కేసు వివరాలు చెప్పాలని పట్టుబట్టారు. ఏయే సెక్షన్లు నమోదు చేశారో చెప్పాలన్నారు. చివరకు పోలీసుల నుంచి కాకాణి నోటీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుత, తనకు నోటీసులు ఇచ్చారని,మంగళవారం సాయంత్రమే విచారణకు రావాలని చెప్పారని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *