ఆఫీసులో DGP రామచంద్రరావు రాసలీలలు
అమరావతి: కర్నాటకలో డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావుకు చెందిన రాసలీలలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముద్దాయి అయిన రన్యారావు సవతి తండ్రి అయిన రామచంద్రరావుపై కూడా దర్యాప్తు జరుగుతుంది.తన ఆఫీసు ఛాంబర్‌లో ఓ మహిళతో ఓసారి యూనిఫామ్ వేసుకుని, సివిల్ దుస్తుల్లో మరోసారి.. వేర్వేరు మహిళలను హత్తుకుంటూ, కిస్ ఇస్తూ సరసం ఆడుతున్న డీజీపీ రామచంద్రరావు వీడియో, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హాల్ చల్ చేస్తున్నాయి.
ಡಿಜಿಪಿ ರಾಮಚಂದ್ರ ರಾವ್ ರಾಸಲೀಲೆ ವಿಡಿಯೋ ವೈರಲ್!#DGP #RamachandraRao #videoviral #KannadaNews #navasamajanews pic.twitter.com/31cuSQWxnp
— navasamaja (@navasamajanews) January 19, 2026
AI టెక్నాలజీతో మార్ఫింగ్:- ఆఫీసు వేళల్లో ఆయన రాసలీలలు ఆడడం అభ్యంతరకరంగా మారింది. డీజీపీ ఆఫీసులోనే ఆ వీడియోను చాలా సీక్రెట్‌గా రికార్డింగ్ చేశారు.ఈ వీడియో సంవత్సరం క్రిందటిది అని అనుమానిస్తున్నారు. ఆ వీడియో సంఘటన పట్ల కర్నాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తానేమీ తప్పు చేయలేదని ఆ డీజీపీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తొంది.ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే అని, తన లాయర్లతో మాట్లాడిన తర్వాత దీని గురించి వెల్లడిస్తానని డీజీపీ రామచంద్రరావు తెలిపారు. అది AI టెక్నాలజీతో మార్ఫింగ్ చేసిన వీడియో అని,,కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేశారన్నారు.
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్:- కె.రామచంద్రరావు (కర్ణాటక కేడర్) 1993 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి, గతంలో కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP), మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా పనిచేశారు.2023 లో, ఆయన DGP గా, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఛైర్మన్, MD గా పదోన్నతి పొందారు. తరువాత ఆయన పౌర హక్కుల అమలు డైరెక్టరేట్ కు DGP గా నియమితులయ్యారు. ఆయన సవతి కూతురు రన్యా రావుకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి పోలీసు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మార్చి 2023 లో ఆయనను తప్పనిసరి సెలవుపై పంపారు.2025 ఆగస్టులో ప్రభుత్వం ఆ లీవ్‌ను విత్‌డ్రా చేసి, మళ్లీ డీజీపీగా నియమించింది.

