ఆక్రమణదారులకు అల్లీపురంలోని టిడ్కో ఇళ్లు అందచేసిన కమీషనర్
నెల్లూరు: నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాలతో కళ్యాణి ఫిలిమ్స్ కార్యాలయం s2 సినిమా హాల్స్ వద్ద కాలువలపై ఆక్రమణలు చేసి నిర్మించిన నిర్మాణములను నగరపాలక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం తొలగించారు. స్థిర నివాసాలను కోల్పోయిన ఆక్రమణదారులకు అల్లీపురంలోని టిడ్కో ఇళ్లను తాత్కాలిక ప్రాతిపదికన మంజూరు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వాసితులు నిడిగుంట కొండమ్మ, యస్ మాల్యాద్రి, బి సుమతి, కే చందుశ్రీ, ఎం సురేంద్ర లకు గృహాల మంజూరు పత్రాలను కమిషనర్ అందజేసారు. భవిష్యత్తులో నిర్వాసితులకు టిడ్కో గృహాలలో శాశ్వతంగా వసతి కల్పించేలా తగిన ఏర్పాట్లు చేస్తామని కమీషనర్ తెలియజేశారు.

