రాగల 12 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం-ఐ.ఎం.డీ
రాష్ట్రంలో రాగల రెండు రోజులు:-
అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి వాయుగుండం గడచిన 6 గంటల్లో 05 కి.మీ వేగంతో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి వాయుగుండ కేంద్రానికి కనీసం 40 కి.మీ. దూరములో,తమిళనాడు-పుదుచ్చేరి,దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు నెమ్మదిగా ప్రయాణించి రాగల 12 గంటల్లో వాయుగుండముగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం 30 కి.మీ దూరంలో నైరుతి & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నదన్నారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- మంగళ,,బుధవారల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఈదురు గాలులు గంటకు 40-50 కీ.మీ గరిష్టముగా 60 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- మంగళ,,బుధవారల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఈదురు గాలులు గంటకు 40-50 కీ.మీ గరిష్టముగా 60 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:- మంగళ,,బుధవారల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఈదురు గాలులు గంటకు 40-50 కీ.మీ గరిష్టముగా 60 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.

