NATIONAL

పహల్గామ్‌ దాడికి,కఠినమైన ప్రతికార చర్య తీర్చుకుంటాం-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

మన్‌ కీ బాత్‌…

అమరావతి: పహల్గామ్‌ లో ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదిన జరిపిన నరమేథంను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని,,ఆ దాడికి కఠినమైన ప్రతికార చర్య తీర్చుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు..ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడి హేయమైన చర్య అన్నారు..పహల్గాం ఉగ్రదాడి తనను ఎంతగానో కలచి వేసిందని,,ప్రతి భారతీయుడు ఈ దారుణాన్ని మర్చిపోలేకపోతున్నాడని ప్రధాని వ్యాఖ్యానించారు.. జమ్ముకశ్మీర్‌ లో వేగంగా జరుగుతున్న పురోగతిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. పహల్గాం పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని సహించలేక అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..జమ్ముకశ్మీర్‌లో గత కొంత కాలంగా శాంతి, సామరస్యం నెలకొన్నాయని,, ఆ పరిస్థితిని చెడగొట్టడానికే ఉగ్రవాదులు దాడులకు పాల్పడరని ప్రధాని ఆగ్రహాం వ్యక్తం చేశారు..జమ్ముకశ్మీర్‌ ప్రశాంతంగా ఉండటం ఉగ్రవాదులకు,, వాళ్లను పెంచిపోషిస్తున్న వాళ్లకు ఇష్టం లేదన్నారు..అలాంటి వారికి కూడా తగిన గుణపాఠం చెపుతామన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *