AP&TGNATIONAL

పింగళి వెంకయ్య 149వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాధవ్

అమరావతి: దేశ వ్యాప్తంగా చేసుకోవాల్సిన పండుగ పింగళి వెంకయ్య జయంతి అని బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్ అన్నారు..శనివారం పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ పింగళి వెంకయ్య జాతీయ జెండా ఆవిష్కరించడం భారతీయు అదృష్టంమని,,1921లో విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని మహాత్మాగాంధీకి బహూకరించారని తెలిపారు..19 సంవత్సరాల‌ వయస్సులో బోరా యుద్ధంలో వెంకయ్య పాల్గొన్నారని తెలిపారు..మచిలీపట్నంలో పింగళి వెంకయ్య అధ్యాపకుడిగా పని చేసారని,,యూనియన్ జాక్ కధ పింగళి వెంకయ్యను కదిలించిందని వెల్లడించారు..అలాగే నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం పింగళి వెంకయ్య రచించారని పేర్కొన్నారు..భారతీయు రైతుల కోసం కంబోడియా నుంచీ మేలి రకం పత్తి తీసుకొచ్చి పత్తి వెంకన్నగా పిలవబడ్డారని అన్నారు..అయన తన జీవిత కాలం చిట్టినగర్ లో తనకు కేటాయించిన స్ధలంలోనే జీవించారన్నారు..ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు,,కార్యకర్తలు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *