లోక్సభ,శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను అమలు చేసేందుకు-అమిత్ షా
అమరావతి: లోక్సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతిగా 50 శాతం పెంచాలని ప్రతిపాదించే రాజ్యాంగ (132వ) సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్ని రాజకీయ పార్టీలను కోరారు. నారీ శక్తి వందన్ చట్టంతో మహిళలకు రాజకీయంగా కొత్త అవకాశాలు రానున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీ వేదికగా మీడియాతో అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లును మహిళలను పాలనలో మరింత బలమైన భాగస్వాములుగా మార్చేందుకు ఉద్దేశించిన “చారిత్రాత్మక చొరవ”గా షా అభివర్ణించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల వ్యవస్థలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు. ప్రతిపాదిత సీట్ల పెంపు, 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందే లోక్సభలో-రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను అమలు చేసేందుకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.

