నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాల్సిందే-సుప్రీంకోర్టు
సీ.ఎస్,డీజీపీ,కలెక్టర్,ధర్మకర్తలకు నోటీసులు..
ఆలయ ధర్మకర్తల మండలి సస్పెండ్..
అమరావతి: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వెలిగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన అదేశాలు అమలు చేయడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వ అధికారులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మదురై జిల్లా కలెక్టర్‌తో పాటు ఆలయ ధర్మకర్తలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేకాదు శనివారం(28-11-26) కొండపై దీపత్తూన వద్ద కార్తీక దీపం వెలగించాల్సిందేనని స్పష్టం చేసింది.
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం, దర్గా భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (CRPF)కు అప్పగిస్తూ స్పష్టంమైన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, ఆలయ నిర్వహణ పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రాజకీయ పెద్దల సూచనల మేరకు అధికారులు వ్యవహరించారనే ఆరోపణలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాలని స్పష్టం చేసింది. కొత్తగా నియమించిన రిసీవర్లు ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ఆదేశించింది.

