ద్రోణి, ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: ద్రోణి, ఈశాన్య రుతుపవనాల రాకతో సోమవారం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో గురువారం మన్యం, అల్లూరి, పోలవరం,విశాఖ, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

