NATIONALPOLITICS

దేశ ప్రజల సేవలోనే నా ప్రయాణం కొనసాగుతుంది-ప్రధాని మోదీ

25 సంవత్సరాలు అధికారిక ప్రస్థానాన్ని..

“మనం చేయగలం”..

దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు..

గ్లోబల్ మేన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్..

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా,దేశ ప్రధానమంత్రిగా ప్రభుత్వం పాలనలో 25 సంవత్సరాలు అధికారిక ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపారు. డిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయంగా తీవ్ర సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా “మనం చేయగలం”(we will do it) అనే సంకల్పంను సభకు హాజరైన ప్రజల చేత పలికించారు.అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సేవా సంకల్ప యాత్రికులు కార్యక్రమానికి హాజరయ్యారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి దేశ ప్రజల సేవలోనే తన పాతికేళ్ల ప్రయాణం కొనసాగిందని చెప్పారు.

ప్రజల ఆశీర్వాదమే నాకు బలం:- 25 ఏళ్లుగా నిరంతర ప్రజా సేవ అందించే అవకాశం తనకు లభిస్తుందని నాడు తాను ఊహించలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇంత సుదీర్ఘమైన ప్రజా సేవా ప్రస్థానంలో ప్రజల ఆశీర్వాదమే తనకు ప్రధాన బలంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం, ఆశీర్వాదంతోనే తాను ముందుకు సాగుతున్నానని చెప్పారు. దేశ ప్రజల సేవలో గడిచిన ఈ పాతికేళ్లు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవని మోదీ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

గ్లోబల్ మేన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్:– 2047 నాటికి ‘వికసిత్ భారత్‌’ ఆశయాన్ని సాధించి తీరుతామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ సాధన, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా దేశం ఎదుగుతున్న తీరును వివరించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త విజయాలు, ఒలింపిక్స్ నిర్వహణ వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలు భారత దేశానికి సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు.

దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు:- గత ప్రభుత్వాలు ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలపై మెతక వైఖరి ప్రదర్శించాయని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. అయితే తమ హయాంలో దేశ భద్రతకు ఏమాత్రం ముప్పు వచ్చినా గట్టి ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చేసి చూపించామని గర్వంగా వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *