AP&TGPOLITICS

జనసేనలోకి వైసీపీ, సీపీఎం నేతలు..పలువురు విద్యావేత్తలు, వ్యాపారవేత్తల చేరిక

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాగబాబు..

అమరావతి: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ, సీపీఎం నాయకులతోపాటు విద్యాసంస్థల నిర్వాహకులు, వ్యాపారవేత్తలు బుధవారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీసీ నాయకులు మధుసూదన్,  శ్రీమతి కటకం జ్యోతి, ఆల్లూరి శంకర్, మర్రి బెంజిమన్‌,  సీపీఎం నేత కొంపెల్ల భాను లక్ష్మి నారాయణ, పలువురు విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు గన్నవరం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా జనసేనలో చేరారు. వీరితో పాటు సుమారు 300 మంది జనసేన పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. 

పవన్ కళ్యాణ్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తారు:-  ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్టీ కార్యకర్తలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా ఆదరిస్తారు. క్షేత్ర స్థాయిలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కొంచం వెనుకా ముందు దక్కవచ్చు. నాతో సహా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికీ అలానే గుర్తింపు దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కచ్చితంగా న్యాయం జరుగుతుంది” అన్నారు.

జన సైనికులకు ఆటోలు, స్వయం ఉపాధి ఉపకరణాలు:- జనసైనికులు, వీరమహిళలు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమంలో  నాగబాబు పాల్గొని లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేశారు. 40 మంది జనసైనికులకు ఆటోలు, 25 మంది వీరమహిళలకు కుట్టు మిషన్లు, 25 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను నాగబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్, కనకదుర్గ ఆలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీమతి ఠాకూర్ పద్మావతి, హజ్ కమిటీ సభ్యులు అబిద్, వీర మహిళా విభాగం నాయకురాళ్లు శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, పార్టీ నాయకులు బొలిశెట్టి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *