ఎన్నికల వ్యవస్థపై ఆసత్యపు ఆరోపణలు సరికావు-ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, అత్యంత పారదర్శకంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ….ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న నిబంధనలు, సాంకేతిక పద్ధతులు, ఓటర్ల నమోదు ప్రక్రియపై కొందరు చేస్తున్న అవాస్తవ ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల సంఘం మరియు చట్టబద్ధమైన వ్యవస్థల ద్వారా జరిగే ఈ ప్రక్రియపై అపోహలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. ఎస్.ఐ.ఆర్ తదితర నిరంతర ప్రక్రియలు పకడ్బందీగా జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తగదని మంత్రి పేర్కొన్నారు.

