NATIONAL

క్రీడ‌ల ప‌ట్ల పిల్ల‌లో ఆస‌క్తి పెరిగితే, బ్లూ స్క్రీన్ బానిస‌త్వం నుంచి బ‌య‌ట‌ప‌డతారు-ప్రధాని మోదీ

బాల్యాన్ని ర‌క్షించే సామ‌ర్థ్యం టీచ‌ర్ల‌కు ఉంద‌ని..

అమరావతి: జాతీయ ఉపాధ్యాయుల దినోత్స‌వం సందర్బంగా జాతీయ టీచ‌ర్ అవార్డులు గెలిచుకున్న వారితో ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ,వారితో స్నేహ పూర్వక సమావేశం అయ్యారు.శనివారం ఢిల్లీలోని 7- లోక్‌క‌ల్యాణ్ మార్గ్‌ లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. తొలుత టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న మాజీ రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ ఎస్ రాధాకృష్ణ‌న్‌కు నివాళి అర్పించారు.అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, పిల్ల‌లు ఎక్కువ‌గా( బ్లూ) మొబైల్,ట్యాబ్,ల్యాప్ టాప్  స్క్రీన్‌కు బానిస అవుతున్న‌రని ఇది ప్రమాదకరంమైన ఆలవాటు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక‌వేళ క్రీడ‌ల ప‌ట్ల పిల్ల‌లో ఆస‌క్తి పెరిగితే, అప్పుడు ఆ స్క్రీన్ బానిస‌త్వం నుంచి వాళ్లు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. క్రీడ‌లు అంటే వీడియో గేమ్స్ కాదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పిల్ల‌ల్లో సృజనాత్మ‌క పెంచాల‌ని, వారిలో ఆట‌ల ప‌ట్ల ఆస‌క్తి పెంచేలా చేయాల‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి ప్రోగ్రామ్‌ల‌ను డిజైన్ చేయాల‌ని టీచ‌ర్ల‌కు ప్ర‌ధాని స‌ల‌హా ఇచ్చారు.

బీహేవియ‌ర్ మార్పుల‌ను ప‌రిశీలించాలి:- కొన్ని ప్ర‌ధాన న‌గ‌రాలు, యూనివ‌ర్సిటీల్లో డ్ర‌గ్స్ స‌మ‌స్య ఉందని, కానీ దీని ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న లేద‌ని, ఎటువంటి వివ‌ర‌ణ లేకుండానే కొన్ని సార్లు ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు. పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న పట్ల టీచ‌ర్లు ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారిలో జ‌రుగుతున్న. యావ‌త్ విద్యా వ్య‌వ‌స్థ‌కు తాను ఒక్క విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నాన‌ని, కేవ‌లం పాఠ్య పుస్త‌కాల బోధ‌న‌ల‌తో మాత్ర‌మే కాదు, పిల్ల‌ల‌తో మ‌మేకం అయితేనే వారిలో మార్పు వ‌స్తుంద‌న్నారు. బాల్యాన్ని అంతం చేయ‌వ‌ద్దు అని, ఆ బాల్యాన్ని ర‌క్షించే సామ‌ర్థ్యం టీచ‌ర్ల‌కు ఉంద‌ని, పిల్ల‌లు స‌జీవంగా ఉండేందుకు కావాల్సిన చ‌ర్య‌ల‌న్నీ చేప‌ట్ట‌డ‌మే టీచ‌ర్ల బాధ్య‌త అని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *