CRIMENATIONAL

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు- డిసెంబర్ 16వ తేదీకి వాయిదా

2 వేల కోట్ల ఆస్తులు-50 లక్షలకు…

అమరావతి: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జిషీటును విచారణకు స్వీకరించే విషయంలో నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేశారు..

యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా కుట్ర జరిగిందని, ఈ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి కలిపి 76 శాతం వాటాలు ఉన్నాయని ఈడీ వెల్లడించింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దూబే, దివంగత మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెంట్, యంగ్ ఇండియన్ అండ్ డొటెక్స్ మర్చంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న కోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.

(బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా ఆస్తులను రూ.50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కుంచుకున్నారని ఈడీ పేర్కొంది.)

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *