DISTRICTSEDU&JOBSOTHERS

కౌశలం కార్యక్రమం ద్వారా 100 ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు- కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి:  కౌశలం కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు AXXELENT PHARMA SCIENCE PRIVATE LIMITED సంస్థలో 100 ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హత: ITI / డిప్లొమా (ఎలక్ట్రికల్) / ఏదైనా డిగ్రీ- అనుభవం: ఫ్రెషర్స్/0–1 సంవత్సరం- ఉద్యోగ స్థలం: తిరుపతి

వేతనం: సంవత్సరానికి ₹2.22 లక్షల నుంచి ₹2.80 లక్షల వరకు.

ఇంటర్వ్యూ తేదీ & సమయం: 03.09.2026 , ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు.

ఇంటర్వ్యూ వేదిక: PGRS హాల్, 1వ అంతస్తు, కలెక్టరేట్, తిరుపతి.

తిరుపతి జిల్లాకు చెందిన ITI / డిప్లొమా (ఎలక్ట్రికల్)/ ఏదైనా డిగ్రీ కలిగిన అందరూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 3వ తేదీన సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *