NATIONAL

19 సంవత్సరాల త‌రువాత మ‌ళ్లీ కోల్‌క‌తాలో అడుగు పెట్టిన రచయిత్రి త‌స్లీమా న‌స్రీమ్‌

కోల్‌క‌తా త‌న‌కు రెండో ఇళ్లు..

అమరావతి: బంగ్లాదేశీ ర‌చ‌యిత‌, సామాజిక కార్య‌క‌ర్త‌ర త‌స్లీమా న‌స్రీమ్‌, దాదాపు 19 సంవత్సరాల త‌రువాత మ‌ళ్లీ కోల్‌క‌త్తాలో అడుగు పెట్టారు. త‌స్లీమా ర‌చ‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తూ 2007లో బెంగాల్‌లో నిర‌స‌న‌లు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో ఆమెను సిటీ నుంచి బ‌ల‌వంతంగా వెళ్ల‌గొట్టారు. శుక్రవారం ఆమె భారీ భ‌ద్ర‌త న‌డుమ నేతాజీ సుభాష్ చంద్ర‌బాస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మాన‌వ హ‌క్కుల సంఘాలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో ఆమె పాల్గోనున్నారు. బంగ్లాదేశ్‌లోని మిమెన్‌సింగ్‌లో ఆమె 1962లో జ‌న్మించారు. ఫిజీషియ‌న్ అయిన ఆమె ర‌చ‌యిత కూడా. న‌వ‌ల‌లు, వ్యాసాలు, మెమోయిర్స్ రాశారు. మ‌హిళ‌ల హ‌క్కులు, సెక్యూల‌రిజం, భావ స్వేచ్ఛ‌, మ‌త‌ఛాంద‌స‌వాదుల‌ను విమ‌ర్శిస్తూ ఆమె చాలా రాశారు.

బంగ్లాదేశ్‌లో హిందువుల‌ను ఊచ‌కోత:- 1993లో త‌స్లీమా రాసిన ల‌జ్జ అనే న‌వ‌ల్ చాలా ఫేమ‌స్ కావడంతో ఆమెకు అంత‌ర్జాతీయ గుర్తింపు వ‌చ్చింది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత త‌ర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల‌ను ఊచ‌కోత కోశారు. ఆ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఆమె ఆ పుస్తకంలో రాశారు. ఆ బుక్‌ను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేశారు. ఇస్లామిస్ట్ గ్రూపులు ఆమెను బెదిరించారు. దీంతో 1994లో ఆమె దేశం విడిచి పారిపోయి, వివిధ దేశాల్లో ఆమె త‌ల‌దాచుకున్నారు. 2004లో భార‌త ప్ర‌భుత్వం నుంచి తాత్కాలిక నివాసం కోసం అనుమ‌తి రావ‌డంతో ఆమె కోల్‌క‌తా చేరుకున్నారు. కోల్‌క‌తా త‌న‌కు రెండో ఇళ్లు అని ఆమె అన్నారు. ఆటోబ‌యోగ్రఫీ ద్విఖందితో వివాదం కావ‌డంతో ముస్లిం సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి.

త‌స్లీమా న‌స్రీన్ ఇండియాలో జీవించేందుకు కేంద్ర అనుమ‌తి:- 2007 నవంబ‌ర్‌లో కోల్‌క‌తాలో తీవ్ర స్థాయిలో హింసాత్మ‌క ఆందోళ‌న‌లు జ‌రిగాయి. అప్పుడు అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ప్ర‌భుత్వం ఆమెను మ‌రోచోటుకు త‌ర‌లించింది. అక్క‌డ నుంచి జైపూర్‌కు ఆ త‌ర్వాత యూరోప్ వెళ్లిపోయింది. ఆమెపై ఇండియాలో బ్యాన్ లేదు. కానీ కోల్‌క‌తాలో జ‌రిగే సాహిత్య ఈవెంట్ల‌కు అనుమ‌తి ద‌క్క‌లేదు. బెంగాల్‌తో సాంస్కృతిక‌, భాష‌ప‌ర‌మైన సంబంధాలు ఉన్న కార‌ణంగా.. కోల్‌క‌తాలో ప‌ర్మ‌నెంట్‌గా సెటిల్ కావాల‌ని భావిస్తున్న‌ట్లు ఆమె అనేక సార్లు చెప్పారు. త‌స్లీమా న‌స్రీన్ ఇండియాలో జీవించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ని బీజేపీ ఎమ్మెల్యే సౌర‌వ్ సిక్దార్ తెలిపారు.1992, 2000 సంవ‌త్స‌రాల్లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆనంద్ పుర‌స్కారాన్ని ఆమె అందుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *