AP&TG

తహశీల్దార్, మీ సేవా కేంద్రాల్లో ఫ్యామిలీ సర్టిఫికెట్-ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

అందుబాటులోకి ‘ఫ్యామిలీ సర్టిఫికెట్..

హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పౌరులు, పౌరులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా అందివ్వటానికి ఉపయోగపడేవిధంగా ఇందిర‌మ్మ ప్రజాప్ర‌భుత్వం ఈ ‘ఫ్యామిలీ సర్టిఫికెట్ ని అందిస్తోంద‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం నాడు మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ప్ర‌జాభ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన ఎస్.ఐ.ఆర్ అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ..  రాష్ట్రంలో రేషన్ కార్డు పొందుతూ త‌ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే సరుకులు, ఆరోగ్యశ్రీ, స‌న్న‌బియ్యం ఇతరత్రా పథకాలను రాష్ట్ర ప్ర‌జ‌లు పొందుతున్నారు. ఇలా ప్ర‌భుత్వ ప‌థ‌కాన‌లు పొందుతూ..  రాష్ట్ర కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వివరాలకు సంబంధించిన సమాచారాన్ని తహశీల్దార్ కార్యాల‌యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కుటుంబమైనా వారికి సంబంధించిన సమాచారం, కుటుంబ సభ్యుల సమాచారం కావాలనుకుంటే తహశీల్దార్ ఆఫీస్, మీసేవ  కేంద్రానికి వెళ్లి ఈ ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ పొందవచ్చని ఆయ‌న చెప్పారు. దీనివల్ల ఎవరైనా ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థలైనా, ఏ సంస్థలైనా మీ కుటుంబ వివరాలకు సంబంధించి ఎవరైనా అడిగితే ఆ వ్యవస్థలకు, ప్రభుత్వ సంస్థలకు, ఈ సమాచారం ఇవ్వటానికి ఉపయోగకరంగా ఉంటుందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *