AP&TGDEVOTIONALOTHERS

బ్రహ్మోత్సవ సేవకులకు వస్త్రాలు అందించిన వేమిరెడ్డి దంపతులు

శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం..

తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి ఆదివారం వస్త్ర బహుమానం అందించారు.

నెల్లూరు లోకసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య,చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య, మీడియాతో మాట్లాడుతూ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవలందించే సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నారని తెలిపారు. స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వస్త్ర బహుమానం అందించడం అభినందనీయమన్నారు. శ్రీవారి కృపాకటాక్షాలు వేమిరెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *