DISTRICTSPOLITICS

అమరావతికి కేంద్రం రాజముద్ర- ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం-కపిర రేవతి

నెల్లూరులో టీడీపీ భారీ ర్యాలీ..

నెల్లూరు రాజధానిగా అమరావతికి కేంద్రం రాజముద్ర వేయడంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.గురువారం సాయంత్రం వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు టిడిపి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మహిళలు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున పాల్గొని, ‘దేవతల రాజధాని వర్ధిల్లాలి’ అంటూ గళమెత్తారు.”జై చంద్రబాబు.. జై జై నారాయణ” నినాదాలతో హోరెత్తించారు. అమరావతికి రాజముద్ర వేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమని, దానిని అద్భుతంగా నిర్మించే సత్తా మంత్రి పొంగూరు నారాయణకి ఉందని టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో అమరావతి నిర్మాణంలో మంత్రి నారాయణ  అలుపెరగకుండా శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్ ఇంతియాజ్ ,నగర అధ్యక్షుడు మామిడాల మధు,టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ,డివిజన్ ప్రెసిడెంట్లు, ఇన్చార్జిలు, కో క్లస్టర్లు ,యూనిట్ ఇన్చార్జిలు, స్థానిక ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *