NATIONALOTHERSTECHNOLOGY

ఇకపై ఇష్టం వచ్చినట్లు సిమ్ కార్డులు వాడకం వీలు కాదు-టెలికమ్యూనికేషన్ల శాఖ

ఇప్పటికే ఉన్న నంబర్ల వివరాలను..

ఫొటో ఐడెంటిటీ ఫీచర్‌ను కూడా..

ఒక్కో నెట్‌వర్క్‌ సిమ్‌లు తొమ్మిది?..

అమరావతి: ఆగష్టు 24 నుంచి టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) భారతదేశం అంతటా ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్ల పరిమితిని (జమ్మూ & కాశ్మీర్, అస్సాం-ఈశాన్య ప్రాంతాలలో 6 కనెక్షన్ల పరిమితిని) ప్రభుత్వం మరింత కఠినంగా అమలు చేయనుంది. ఈ సిమ్ కార్డుల సంఖ్య లిమిట్ కొత్తది కానప్పటికీ, ఇప్పటికే మీ గరిష్ట సిమ్ కార్టులను తీసుకుని ఉన్నట్టయితే, టెలికాం ఆపరేటర్లు ఇకపై ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త సిమ్ కార్డులను బ్లాక్ చేస్తారు. జియో (Jio),ఎయిర్‌టెల్ (Airtel),ఇతర టెలికాం సంస్థలు,,ఇప్పటికే తమ పేరిట తొమ్మిది సిమ్ కార్డులు ఉన్నవారికి కొత్త సిమ్ కార్డులను జారీ చేయడాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఉన్న నంబర్ల వివరాలను:- కొత్త సిమ్ (SIM) జారీ చేసే ముందు టెలికాం కంపెనీలు మీకున్న ప్రస్తుత కనెక్షన్‌లను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. దీనివల్ల, ఇప్పటికే గరిష్ట పరిమితికి చేరుకున్నవారు అదనపు నంబర్లను పొందడం కష్టమవుతుంది. అలాగే, కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీ దగ్గర ఇప్పటికే ఉన్న నంబర్ల వివరాలను కూడా మీరు తెలియజేయాల్సి ఉంటుంది.

ఫొటో ఐడెంటిటీ ఫీచర్‌ను కూడా:- ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలో కస్టమర్ల డీటైల్స్ అన్నీ ఉంటాయి. ఒక కస్టమర్ ఎన్ని సిమ్‌లు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని టెలికాం సంస్థలు ఇందులో అప్‌డేట్ చేస్తాయి. దీంతో కస్టమర్‌కు సంబంధించిన సిమ్‌ల వివరాలు లభిస్తాయి. కంపెనీలు దీని ఆధారంగా కస్టమర్ సిమ్ లిమిట్ పూర్తైందా,, కొత్త సిమ్ జారీ చేయాలా అనే విషయాన్ని నిర్ధరిస్తాయి. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలో ఫొటో ఐడెంటిటీ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టబోతుంది. ఒకవేళ పరిమితికి మించి సిమ్‌కార్డు జారీ అయితే, ఆ తర్వాత ఆ సిమ్‌ కార్డును వెంటనే రద్దవుతుంది. ఈ అంశంలో కస్టమర్‌పై లేదా టెలికాం ఆపరేటర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లిమిట్ దాటిన వారు కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి లిమిట్ దాటిన విషయాన్ని తెలియజేయాలి.

ఒక్కో నెట్‌వర్క్‌ సిమ్‌లు తొమ్మిది?:- ఇది దేశంలోని అన్ని టెలికాం సంస్థలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం,, ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్ కార్డులు కలిగి ఉండొచ్చు.దిని ఆర్దం,, ఒక్కో నెట్‌వర్క్‌ సిమ్‌లు తొమ్మిది కాదు. అన్ని నెట్‌వర్క్‌ ల సిమ్‌లు కలిపి 9 దాటకూడదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *