AP&TG

ఆదివారం పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

అమరావతి: ఆదివారం అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు,,మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, మార్కాపురం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని తెలిపింది. రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఉదయగిరి, రాపూరు, పోదలకూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన ఒకటి, రెండు చోట్ల భారీ వర్షసూచన గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *