NATIONAL

భారత చరిత్రలో ఒక కీలకమైన సమయంలో ప్రధానిగా సేవాలు అందించిన లాల్ బహదూర్ శాస్త్రి చిరస్మరణియుడు-ప్రధాని మోదీ

అమరావతి: నిరాడంబరత, దేశభక్తి ప్రగాఢంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన లాల్ బహదూర్ శాస్త్రి 70వ వర్దంతి సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అర్పించారు. 1964 నుండి 1966 వరకు భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా, ఆయన భారత చరిత్రలో ఒక కీలకమైన సమయంలో దేశానికి నాయకత్వం వహించారు.

స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటికే లాల్బహదూర్శాస్త్రి అపార శక్తి సామర్థ్యాలను జాతీయ నేతలు గుర్తించారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిందిగా ఆయనకు పిలుపు వచ్చింది. దానిని ఆయన అందుకున్నారు. స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్లో పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు స్వీకరించిన లాల్బహదూర్ స్వయంకృషితో కొద్దికాలంలోనే రాష్ట్ర హోంమంత్రి స్థాయికి ఎదిగారు. కఠోరశ్రమకు, సామర్థ్యానికి ఉత్తరప్రదేశ్లో లాల్బహదూర్ ఒక సమున్నత సంకేతంగా నిలిచారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వపెద్దలు ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. 1951లో లాల్బహదూర్ ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తర్వాత కాలంలో రైల్వే మంత్రిగా, రవాణా సమాచార మంత్రిగా, వాణిజ్య పరిశ్రమల మంత్రిగా, హోంమంత్రిగా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

రష్యాలోని తాష్కెంట్ లో భారత్,పాకిస్తాన్ ల మధ్య జరిగిన చర్చల కోసం వెళ్లారు.ఒప్పందం జరిగిన అనంతరం అయన గుండెపోటుతో మరణించాడన్న వార్త దేశంలో దావానలంగా వ్యాపించింది.ఈ వార్తతో దేశ ప్రజలు తల్లడిల్లిపోయారు. లాల్ బాహుదూర్ శాస్త్రి మరణం వెనుక అమెరికా గూఢచారి సంస్థ అయిన CIA హస్తం వున్నట్లు,అప్పట్టో సదరు సంస్థలో పనిచేసిన అధికారి స్వయంగా ఒక ఇంటర్వూలో ఒప్పుకున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *