NATIONAL

174 మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు’ విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’

అమరావతి: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్ర ఘటనకు సందర్బంలో  తెగువ ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనకు అందించనున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేడు ప్రకటించారు.

విమానంతో సహా ఆత్మహుతి చేసుకునేందుకు కాక్‌పిట్‌లో కో పైలట్ కాక్‌పిట్‌లో ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డుకున్న పైలట్ పై దాడి చేసి కత్తితో పొడిచినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యంగా వ్యవహరించి విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడారు.అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని విమానాశ్రయానికి మళ్లించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్ఛర్ చూపిన ధైర్యం కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కెప్టెన్ మచ్ఛర్ సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. మచ్ఛర్ గుజరాత్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. ఆయన కుటుంబం చాలా కాలం క్రితమే ముంబైకి వెళ్లిపోయిందని వెల్లడించారు.ముంబైలో పెరిగిన ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *