AP&TG

రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల్లో బార్లకు అనుమతి ఇచ్చిన ఎక్సైజ్ శాఖ

అమరావతి: రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌ లకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. తిరుపతి ఎయిర్‌పోర్టు మినహా అన్ని ఎయిర్‌పోర్టులకు బార్ లైసెన్స్‌ లు వర్తించనున్నాయి.ఎయిర్‌పోర్టు ఆపరేటర్ రేకమెండేషన్ ఉంటేనే బార్ లైసెన్స్ మంజూరు అవుతుంది. బార్ లైసెన్స్ దరఖాస్తుకు 5 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుల రద్దీ 20 లక్షలకు పైగా ఉన్న ఎయిర్‌పోర్టులకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 25 లక్షలు రూపాయలు, ప్రయాణికుల రద్దీ 20 లక్షలలోపు ఉన్న ఎయిర్‌పోర్టులకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 15 లక్షలు రూపాయలుగా నిర్ణయించారు. ఆ ట్యాక్స్‌ ను ఒకేసారి లేదా 6 సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండనుంది. ఎయిర్‌పోర్టు బార్లను 24 గంటలపాటు నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుంది. భద్రత, ఎయిర్‌పోర్టు ఆపరేషనల్ నిబంధనలకు లోబడి 24×7 సేవలు ఉండనున్నాయి. బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *