AP&TG

ఒడిశా వద్ద వేకువజామున తీరం దాటిన వాయుగుండం

ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం…

అమరావతి: వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.మంగళవారం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి సమీపంలో వేకువజామున తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.. గడిచిన 6 గంటల్లో 7కి.మీ వేగంతో వాయుగుండం కదిలినట్లు అధికారులు పేర్కొన్నారు.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు..గంటకు 35 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపారు..మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు..ఈ నెల 24 ఆదివారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది..

స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి:- కృష్ణా, గోదావరి వరద ఉధృతంగా ప్రవాహిస్తున్న నేపధ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి కృష్ణా,గోదావరి పరీవాహక 13 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు..ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని కోరారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *