AP&TGNATIONALOTHERSTECHNOLOGY

BSNL శాటిలైట్ ఫోన్‌-లక్ష 34 వేలు!

అమరావతి: దేశంలో సెల్ ఫోన్ నెట్‌వర్క్ రాని మారుమూల ప్రాంతాలు, కొండ కోనల్లో సైతం నిరంతరాయంగా కమ్యూనికేషన్ అందించేందుకు వీలుగా BSNL సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నులతో కలిపి దీని ధరను రూ.1,34,166గా నిర్ణయించారు. సాధారణ స్మార్ట్‌ ఫోన్‌లు సెల్ టవర్స్ తో అనుసంధానమై నెట్ వర్క్ ను అందిస్తాయి.అయితే ఇది నేరుగా శాటిలైట్ అనుసంధానమై పనిచేస్తుంది. దీనికోసం BSNL సంస్థ గ్లోబల్ శాటిలైట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ అయిన ‘ఇన్మార్శాట్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్కడి నుండైనా వాయిస్ కాల్స్, మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో, అత్యవసర సమయాల్లో వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *