జనసేనానిగా మీరు నన్ను ఎంచుకున్నారు, నేను చెప్పింది వినండి-పవన్ కళ్యాణ్
అమరావతి: అమిత్ షా లాంటి వ్యక్తిని నేను అవినితి కేసుల్లో వున్న వ్యక్తిని జైల్లో పెట్టమని అడిగినట్లు,ఒక విశ్లేకుడు ప్రక్కనే వుండి వినినట్లు మాట్లాడడం చూస్తుంటే నాకు బాధ వేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.సోమవారం జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీలో కొంత మంది వ్యక్తులు, పార్టీ లైన్ దాటి వ్యహరిస్తున తీరుపై కఠినమైన చర్యలు వుంటాయని తన వైఖరిని స్పష్టం చేశారు.
