AP&TG

తెలంగాణలో రూ.9,400 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ

ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం..

గతంలో, భారతదేశం ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు మన వస్త్ర పరిశ్రమ భారీ పాత్ర పోషించింది; మేము ఇప్పుడు ఆ వారసత్వాన్ని మళ్లీ బలోపేతం చేస్తున్నాము; వరంగల్ లో పిఎమ్ మిత్ర పార్కు దేశంలో వస్త్ర క్రాంతిని వేగవంతం చేస్తుందని తెలిపారు.

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అదివారం తెలంగాణలోని హైదరాబాద్ లో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జాతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన కేంద్రంగా హైదరాబాద్ కు ఉన్న పరివర్తన ప్రాముఖ్యాన్ని గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. గత 12 సంవత్సరాలుగా, ఆధునిక కనెక్టివిటీ కూడా భారత ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా ఉంది.అది రహదారులు కావచ్చు, రైల్ వేలు కావచ్చు, లేదా విమానాశ్రయాలు కావచ్చు.. ప్రతి ఒక్క కనెక్టివిటీ మార్గంలో ఇదివరకు ఎన్నడూ లేనంతటి విధంగా పెట్టుబడి పెట్టడం జరుగుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుండి వేల కోట్ల రూపాయలు ఈ సౌకర్యాలకు నిధులు సమకూరుస్తాయని, తెలంగాణ, హైదరాబాద్ లోని వేలాది మంది యువకులకు ఉపాధి మార్గాలను సృష్టిస్తాయని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. “ఇక్కడ తయారైన వాహనాలు, యంత్రాలు, ఈ జోన్లో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెలంగాణ కార్మికులు, రైతులకు సాధికారత కల్పిస్తాయి” అని మోదీ ఉద్ఘాటించారు.

వస్త్ర పరిశ్రమలు పరివర్తనాత్మక పాత్ర పోషించాయని, సమకాలీన కార్యక్రమాల ద్వారా ఈ వ్యూహాత్మక రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. వరంగల్ లోని పీఎం మిత్ర పార్క్ జాతీయ వస్త్ర విప్లవానికి ఎలా ఉత్ప్రేరకం అవుతుందో ఆయన నొక్కిచెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *