AP&TG

హిందూ విద్యార్థికి “కల్మా” చదివి రావాలని హోమ్‌వర్క్ ఇచ్చిన టీచర్

మండిపడుతున్న తల్లి,తండ్రులు..?

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ సైదాబాద్‌లో ఉన్న “సక్సెస్ స్కూల్‌”లో హోమ్‌వర్క్‌ కు సంబంధించిన ఓ సంఘటన వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి “కల్మా, సూరహ్ ఫాతిహా” చదివి రావాలని హోమ్‌వర్క్ ఇవ్వడంతో పాటు అదే విషయాన్ని స్కూల్ డైరీలో కూడా సదరు టీచర్, రాయడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సదరు టీచర్‌ను ప్రశ్నించారు. తమ కుమారుడికి ఇలాంటి హోమ్‌వర్క్ ఎందుకు ఇచ్చారంటూ వివరణ కోరారు.

తల్లిదండ్రులు అభ్యంతరం:- తమ పిల్లలకు మతపరమైన అంశాలను నేర్చుకోవాలని చెప్పడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘మా స్కూల్‌లో చదవాలంటే ఇవి నేర్చుకోవాల్సిందే’ అని సదరు టీచర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై స్కూల్ యాజమాన్యం, సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

హోమ్‌వర్క్ ఇవ్వడందుర్మార్గం:- ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందూ విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోమ్‌వర్క్ ఇవ్వడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *