INTERNATIONALNATIONALOTHERS

యూరోప్‌లో సెగలు రేపుతున్న వేసవి కాలం

1000 మృతి…

అమరావతి: యూరోప్‌లో వేసవి కాలం సెగ రేపుతొంది. ఎండల వేడి త‌ట్టుకోలేక‌, జ‌నం చల్ల దనం కోసం పరుగుతు తీస్తున్నారు. అధిక ఉష్ణోగ్ర‌త‌ల వ‌ల్ల ఫ్రాన్స్‌ లో సాధార‌ణం క‌న్నా ఈసారి వెయ్యి మంది అధికంగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు వెల్లడించారు. 2003 త‌రువాత భారీ స్థాయిలో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌తులు న‌మోదు అవుతున్నాయి. ఫ్రాన్స్‌ లోని అనేక ప్రాంతాల్లో గ‌త కొన్ని రోజులుగా 40 డిగ్రీల క‌న్నా ఎక్కువ ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అయ్యాయి. జూన్ 24వ తేదీ నుంచి దాదాపు 1000 మందికి పైగా వేడి వ‌ల్ల మృతిచెందిన‌ట్లు నేష‌న‌ల్ ప‌బ్లిక్ హెల్త్ ఏజెన్సీ పేర్కొన్న‌ది. ఇందులో బాధితుల్లో 85 శాతం మంది 65 ఏళ్లు దాటిన‌వారే ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. తీవ్ర హీట్‌వేవ్‌కు కారణంగా పారిస్‌లో అనేక ఈవెంట్ల‌ను ర‌ద్దు చేశారు. ఆస్ప‌త్రులు, శ్మ‌శాన‌వాటిక‌లు కిక్కిరిసిపోతున్న‌ట్లు అధికారులు చెప్పారు. ఆదివారం జ‌ర్మ‌నీలో 41.7 డిగ్రీలు, చెక్ రిప‌బ్లిక్‌లో 41.1 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. వేస‌వి కాలంలో ఈ సారి అనేక యురోప్ దేశాల్లో తీవ్ర నీటి ఎద్ద‌డి ఉన్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ తెలిపింది. సైప్ర‌స్‌లో అత్య‌ధికంగా 92 శాతం నీటి కొర‌త ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *