AP&TG

నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణాలు పూర్తి కావాలి-సీఎం చంద్రబాబు

2 నెలలకు ఒకసారి సమీక్ష..

అమరావతి: యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం జరగాలని అన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

మంత్రి నారాయణ:- హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా, సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకమూ లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తు్న్నామని మంత్రి తెలియచేశారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ అధికారులు, వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *