AP&TGDEVOTIONALNATIONALOTHERS

తిరుమలలో అనూహ్య రద్దీ కారణంగా సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల: వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొన్న కారణంగా అధిక మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. ఈ నేపథ్యంలో ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల జారీని కూడా సోమవారం రద్దు చేయడమైనది. ఈ విషయాన్ని గమనించి భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది. అదేవిధంగా తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, బయట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులందరూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *