సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మిని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియామిస్తూ ఉత్తర్వులు
అమరావతి: రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నసీనియర్ IAS అధికారి వై.శ్రీలక్ష్మిని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియామించింది. సాధారణ పరిపాలన శాఖ (GAD) పరిధిలోని పాలనా సంస్కరణల విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీలక్ష్మికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ ఏడాది జూలై 31న ఆమె పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్ మెంట్ కు ముందే ఈ నియామకం జరిగింది.

