AP&TG

ద్రోణి ప్రభావంతో మంగళవారం మోస్తరు వర్షాలు-విపత్తుల నిర్వహణ శాఖ

అమరావతి: రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *