బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఆంధ్రప్రదేశ్-అవార్డు అందుకున్నమంత్రి కందుల దుర్గేష్
నవ్యాంధ్ర పర్యాటకానికి ‘గ్లోబల్’ కిరీటం..”
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని అపారమైన పర్యాటక వనరులను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో కూటమి ప్రభుత్వం చూపిన అసాధారణ ప్రతిభకు గానూ దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్ పో అయిన ‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్-2026’ఆంధ్రప్రదేశ్‌ను “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఎంపిక చేసింది. కేరళలోని కోవాలం ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’లో జరిగిన ప్రతిష్టాత్మక బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-కన్స్యూమర్ పర్యాటక వేదికపై, దేశవిదేశాల ప్రముఖుల సమక్షంలో కేరళం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి పి.సి.విశ్వనాథ్, ఎమ్మెల్యే మురళీధరన్, త్రివేండ్రం మేయర్ వి.వి.రాజేష్ ల చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును సంతోషంగా స్వీకరించారు. ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

