జూన్ 8వ తేదీన ఇండియా కటమి సమావేశాన్ని బహిష్కరించిన డీఎంకే
అమరావతి: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో చోటు చేసుకున్న అవకాశ వాద రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే కీలక నిర్ణయం ప్రకటించింది. జూన్ 8వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఇండియా కటమి సమావేశాన్ని బహిష్కరించాలని డీఎంకే నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఈ సమావేశానికి వెళ్లే ప్రసక్తే లేదంటూ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందంటూ డీఎంకే మండిపడింది. కాంగ్రెస్ పార్టీ వైఖరితో డీఎంకే శ్రేణులు తీవ్ర మనస్తాపం చెందాయని,ఇందులో భాగంగా కార్యకర్తల మనో భావాలను గౌరవిస్తూనే ఇండియా కూటమి భేటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది.

