CRIMENATIONAL

ఈశాన్య రాష్ట్రంమైన మణిపూర్ లో పెద్ద ఎత్తున పట్టుబడిన పవర్ పుల్ అయుధాలు

కార్డెన్ సెర్చ్-జాయింట్ అపరేషన్..

అమరావతి: మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని లామ్‌డెంగ్‌లో ఉన్న ఒక అనధికార UNLF (P) (యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్- (పాంబే వర్గం) శిబిరంలో, మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్,CRPF దళాలు సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ అపేరేషన్ చేపట్టాయి. గురువారం జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో, AK సిరీస్ రైఫిల్స్, M-సిరీస్ రైఫిల్స్, పిస్టల్స్, ఇతర తుపాకులతో సహా 29 ఆయుధాల భారీ డంప్ ను భధ్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం కూడా కొనసాగిన సెర్చ్ ఆపరేషన్‌లో సంయుక్త భద్రతా దళాలు AK సిరీస్ రైఫిళ్లు, M–సిరీస్ రైఫిళ్లు, స్నైపర్ రైఫిల్, కార్బైన్, షాట్‌గన్‌లు, మోర్టార్లు, RPG-7 లాంచర్, యాంటీ డ్రోన్ జామ్మర్, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలతో సహా అదనంగా 38 ఆయుధాలతో కలుపుకుని మొత్తం 67 అయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మణిపూర్ పోలీసులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *