తెలంగాణలోనూ బెంగాల్ పరిస్థితులు కనిపిస్తున్నాయి-ప్రధాని మోదీ
తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం..
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో ఎవరు ఉహించిన విధంగా భారతీయ జనతా పార్టీ తొలిసారి అద్భుత విజయం సాధించిందని, తెలంగాణలోనూ బెంగాల్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తూ.. ‘సుపరిపాలనతోనే దేశ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తూ, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో:- అబ్ కీ బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్. అసోంలో మూడోసారి అధికారంలోకి వచ్చాం. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతే. బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారు. మమత నియంతృత్వాన్ని బెంగాల్ ప్రజలు ఎదిరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తోంది. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు కాదు.. విశ్వాస రాజకీయాలను ప్రజలు నమ్ముతున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు 200 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు’.. ‘ఒకప్పుడు బీజేపీకి రెండే ఎంపీ సీట్లు ఉండేవి. అందులో ఒకటి తెలంగాణ నుంచే అన్నారు. తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు.
కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనే:- మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా.. అబద్ధాలతోనే పాలన సాగిస్తోంది. హామీలతో ఆకాశానికి ఎత్తి తర్వాత మోసం చేస్తారు. కాంగ్రెస్ మావోయిస్టు పార్టీగా మారింది. ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌గా మారింది. మావోయిస్టుల హింసతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. దేశమంతా మావోయిస్టులు అంతమైనా తెలంగాణలో ఇంకా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. తెలంగాణలో మావోయిస్టులను అంతం చేయాలంటే బీజేపీ పాలన ఒకటే మార్గం అన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు:-ప్రపంచం ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాతో సప్లయ్ చైన్ దెబ్బతింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగాయి. రెండు నెలల నుంచి ప్రజలపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తోంది. ధరలను పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదు. క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు నా వినతి. పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించండి. విదేశీ మాదకద్రవ్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్‌లు పెట్టుకోవాలి. ప్రజా రవాణాను వినియోగించాలని కోరారు.

