జనగణన విధుల్లో నిర్లలక్ష్యం-14 మంది వార్డు అడ్మినిస్ట్రేషన్ లకు షోకాజ్ నోటీసులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగింపు…
జన గణన 2027 కార్యక్రమంలో నిర్దేశించిన విధులను చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు ఎన్యుమరేటర్లకు షోకాజ్ నోటీసులను శుక్రవారం జారీచేశారు. షో కాజు నోటీసులు అందుకున్నవారిలో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీలు మలిశెట్టి సుప్రియ (హెచ్.ఎల్.బి 0069), మలిశెట్టి రమేష్ (0911), లక్ష్మీ భవాని (0874), అమెనిటీస్ సెక్రటరీ కీర్తిపాటి భాను (1196), శానిటేషన్ సెక్రటరీలు దారా సురేష్ బాబు (0436), నెల్లూరు మోసెస్ (1070), హనీ తలారి (1115), ఎడ్యుకేషన్ సెక్రటరీ సి.హెచ్ శ్రీనివాసులు (0333), ప్లానింగ్ సెక్రటరీ ఆర్. శివకేశమ్మ (0159), రెవెన్యూ సెక్రెటరీ లు వంగలు ప్రసాద్ (0790), పిట్ల నిరంజన్ (0797), పుట్టా అరుణమ్మ (0101), అవినాష్ (1269), డేటా ఎంట్రీ ఆపరేటర్ కె.రోహిణి (0906) లకు షో కాజ్ నోటీసులను జారీ చేశారు. ఆప్కాస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ షేక్ షాజీర్ (1023) ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

