NATIONALPOLITICS

పశ్చివ బెంగాల్, అస్సాం,పుదుచ్చేరిలో రెపరెపటాడిన కాషాయ జెండా

మమత అరాచకాలకు శాశ్వత తెర…

కార్యకర్తల కఠోర శ్రమ వల్లే ఈ విజయం..

అమరావతి: నాలుగు రాష్ట్రలు,ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ రెండు అతి ముఖ్యమైన రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా దాదాపు విజయ కేతనం ఎగురు వేసింది.అస్సాంలో మూడవ సారి అధికారంలో చేపట్టే దిశగా దూసుకుని పోయింది. అలాగే చివరి నిమిషం వరకు ఉత్కఠం రేపిన పశ్చివ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ అఖండ విజయం నమోదు చేసే దిశగా నిలకడగా వెళ్లుతొంది. అస్సాంలో 126 స్థానాలకు గాను 102 స్థానాలను దాదాపు సాధించింది.అలాగే పశ్చివ బెంగాల్లో 293 స్థానాలకు గాను 207 స్థానాల్లో దాదాపు విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అవుంతొంది.మమతా బెనర్జీ కేవలం 80 స్థానాలకే పరిమితం అయింది.కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను NDA 18 స్థానాలను ఖరారు చేసుకుంది. కేరళంలో 140 స్థానాలకు UDF 102  స్థానాలకు కైవశం చేసుకుంది. LDF 35 స్థానాలకే పరిమితం అయింది. దేశంలో కమ్యూనిస్టు పార్టీ పాలిత రాష్ట్రాం అయిన కేరళ నుంచి ప్రక్కకు తొసి వేయడం జరిగింది. తమిళనాడు కొత్తగా పార్టీ స్థాపించినప్పటికి హీరో విజయ్ అనూహ్య విజయం 237 స్థానాలకు గాను 107 స్థానాల్లో విజయం సాధించడం దాదాపు ఖాయం కావడంతో, అతి పెద్ద పార్టీగా అవతరించింది.DMK+CONG కూటమి కేవలం 74 స్థానాల్లో, AIDMK+BJP దారుణంగా 53 స్థానాల్లో పరిమితం కావల్సి వచ్చింది. కేంద్ర ఎన్నిక కమీషన్ పూర్తి స్థాయి అధికారిక వివరాలు వెల్లడించాల్సి వుంది.

కార్యకర్తల కఠోర శ్రమ వల్లే ఈ విజయం- నరేంద్ర మోదీ:-పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి విజయం ఖరారైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను అభినందించారు. వారి కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. మంచి పాలన అందించాలన్న బీజేపీ అభిమతమే అంతిమంగా పైచేయి సాధించిందని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *