సోలార్ పవర్ ప్రాజెక్టులు వ్యవసాయ రంగానికి స్థిరమైన-నిరంతర విద్యుత్-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలోని వ్యవసాయ వినియోగదారులకు పగటి సమయంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకంను సమర్దవంతంగా అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల అధికారులను అదేశించారు.సోమవారం కలెక్టర్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఈ పథకం అమలుకు సంబంధించి మొత్తం 437 ఎకరాల భూమిని గుర్తించామని, అందులో 215 ఎకరాల భూమి ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం పూర్తయిందని, అలాగే మిగిలిన భూమిలో 22 ఎకరాలను అతి త్వరలోనే స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
ఈ భూములపై సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, ఇక్కడ ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును జిల్లాలోని అన్ని విద్యుత్ డివిజన్లకు పంపిణీ చేసి, వ్యవసాయ రంగానికి స్థిరమైన-నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.రాఘవేంద్రం, ఇతర అధికారలుల తదితరులు, నెడ్ క్యాబ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రామలింగయ్య అధికారులు పాల్గొన్నారు. .

