AP&TGBUSINESSOTHERS

విజయ పాలు,పెరుగు ధరలు పెంపు-కృష్ణా మిల్క్ యూనియన్

పాలు లీటరుకు రూ.2..

అమరావతి: కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడు రకాల పాలపై లీటరుకు రూ.2 పెంచారు. పెరుగు బకెట్లపై రూ.10 నుంచి రూ.30 వరకు పెంచారు. ఒక స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ 10 కేజీలపై రూ.40 పెంచారు. పెంచిన ధరలు ఈనెల 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, నెలవారీ కార్డులు కొన్న వారికి ఏప్రిల్ 9వ తేదీ వరకు పాత ధర లు వర్తిస్తాయని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణా వ్యయం, బటర్, పౌండర్ ధరలు పెరగటంతో పాటు రైతులకు ఇచ్చే ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధరలు పెంచాల్సి వచ్చిందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *