AP&TG

మోహన్ బాబు యునివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య?

తిరుపతి: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్న భువన (22) సోమవారం రాత్రి హాస్టల్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకున్నట్లు సమాచారం. భువన మరణించిన విషయంను కాలేజ్ యాజమాన్యం, తల్లిదండ్రులకు ఆలస్యం సమాచారం అందించినట్లు తెలుస్తొంది. మోహన్ బాబు కాలేజ్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు.

చంద్రగిరి మండలం, రంగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతురాలు పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంకు చెందిన విద్యార్థినిగా తెలుస్తొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు జరుగుతొందని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *