DISTRICTS

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం-ఆకుల మహేంద్రరెడ్డి

నెల్లూరు: ‘మేరా యువ భారత్’ (MY Bharat) మరియు కావలికి చెందిన ‘ది పూర్ పీపుల్ వాలంటీర్ ఆర్గనైజేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో కావలి పట్టణంలో “యువ మండల్ వికాస్ అభియాన్” కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా జరిగింది. యువతలో సామాజిక స్పృహ పెంపొందించడం-ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రరెడ్డి మాట్లాడుతూ, యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘మేరా యువ భారత్’ వేదిక ద్వారా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.నాగేశ్వర రావు (సెట్నెల్ సిఈఓ) మాట్లాడుతూ యువతకు ఉన్న ఉపాధి అవకాశాలు మరియు ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. శ్రీనివాసులు (మేనేజర్) మాట్లాడుతూ యువజన సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. చిన్న (NGO ప్రతినిధి, ది పూర్ పీపుల్ వాలంటీర్ ఆర్గనైజేషన్) మాట్లాడుతూ సేవా దృక్పథంతో పనిచేసే యువతకు తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ ప్రతినిధులు, వివిధ యువజన సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సేవకులు-స్థానిక యువత పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *