భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది-డొనాల్డ్ ట్రంప్
భారత్ ను బెదిరించడం,భయపెట్టడడంలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించి తన ముందు మెకారిల్లేలా చేసుకోవాలని చూసిన అమెరికా అధ్యక్షడు ట్రాంప్ కు, భారత ప్రధాని నరేంద్రమోదీ దెబ్బ ఎలా వుంటుందొ తెలిసి వచ్చింది.బ్రిటన్,యుఏఈ, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు పరుగు పెడుతూ వచ్చి,భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ డిల్స్ కుదుర్చుకుంటు,తమ దేశాల ఆర్దిక వ్యవస్థలకు ఉపశమనం కలిగిస్తూన్నాయి. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందన్న భయంతో, అయన బెదిరింపు ధొరణి ప్రక్కన పెట్టిన ట్రంప్, భారతదేశంతో స్వేచ్చ వాణిజ్య ఒప్పదం కుదిరిందంటూ ప్రకటించారు.
ట్రంప్ కు తత్వం బోధ పడింది…
అమరావతి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో గత సంవత్సరం నుంచి ఎడాపెడా పెంచిన టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం విధించిన టారిఫ్‌లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం జరిగిందని,, ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సోషల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను.. ఆయన నాకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శక్తిమంతమైన నాయకుడు అంటూ మోదీని కీర్తించారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది అని ట్రంప్ తెలిపారు.
భారత్ పై ప్రతీకార టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.“ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు” అని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు.

