ప్రియాంకా వాద్రా కుమారుడు రెహాన్ వాద్రాకు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం
అమరావతి: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా(25)కు ఆయన గర్ల్ ఫ్రెండ్ అవీవా బేగ్‌తో సోమవారం నిశ్చితార్థం జరిగింది. అవీవా బేగ్,,రెహాన్ వాద్రాలు దాదాపు 7 సంవత్సరాలుగా స్నేహితులు. రెహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌కు పెళ్లి ప్రతిపాదన చేయగా ఆమె అంగీకరించిందని జాతీయ మీడియా పేర్కొంది. అవీవా బేగ్, ఆమె కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ప్రియంక వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్. వన్యప్రాణి, స్ట్రీట్, వాణిజ్య ఫొటోగ్రఫీలో పాల్గొంటుంటారు. రెహాన్ వాద్రా నిశ్చితార్థంపై వారి కుటుంబం నుంచి అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన రాలేదు.

