CRIMENATIONAL

అనుమానిత ఆత్మాహుతి సభ్యుడు

11-అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయంశం అయింది. పేలుడు ధాటికి 12 మంది మరణించగా,,15 మంది గాయపడ్డారు. వారిని LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన కారు హర్యానాలో రిజిస్టర్‌ అయినట్టు గుర్తించిన పోలీసులు,, కారు యజమానిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. బాంబు పేలుడు జరిగిన కారు చివరి యజమాని పుల్వామా వాసి తారిక్‌గా గుర్తించారు. NSG కమాండోలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.ఎర్రకోట మెట్రోస్టేషన్‌ దగ్గర CCTV ఫూటేజీ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారు HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న వాహనం ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటలకు పైగా నిలిపి ఉంచారు.

అనుమానిత ఆత్మాహుతి బాంబర్ చేయి కిటికీపై ఉంచి కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశిస్తున్నట్లు ఒక చిత్రం చూపిస్తుంది. ఆ కారు డ్రైవర్ నీలం, నలుపు రంగు టీ-షర్టు ధరించి ఉన్నట్లు చెబుతున్నారు. కారు పార్క్ చేసిన తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఒక్క క్షణం కూడా కారు నుంచి దిగలేదని వర్గాలు తెలిపాయి. అతను ఎవరికోసమో వేచి చూస్తున్నాడని లేదా పార్కింగ్ స్థలంలో సూచనల కోసం ఎదురు చూస్తున్నాడని వారు తెలిపారు. హ్యుందాయ్ ఐ20 కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్.. ఆత్మాహుతి బాంబర్ అని అధికారులు అనుమానిస్తున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *