జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్సులు
అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బుధవారం సుమారు 2-15 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైకులపై చెక్‌పాయింట్ వద్దకు వచ్చి CRPF జవాన్లపై కాల్పులు జరిపి పారిపోయారు. జవాన్లలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన బలగాలు, వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి. గాయపడిన జవాన్లను హుటాహుటిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉగ్రదాడి నేపథ్యంలో ఆ ప్రాంతంతో భారీ బలగాలను మోహరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారు 46వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది.

