గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
అమరావతి: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన హమీని నిలపెట్టుకుంది. గ్రూప్-2 పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 720 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ గ్రూప్-2 ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు డిసెంబర్ 11వ తేదీ లోపు అందచేయాల్సి వుంటుంది. 2027 ఫిబ్రవరి 21వ తేదీన గ్రూప్ స్క్రీనింగ్ టెస్టు ఆఫ్ లైన్‌లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో జరిగే మెయిన్స్ పరీక్ష తేదీలను తరువాత ఏపీపీఎస్సీ వెల్లడించనుంది.
డిప్యూటీ తహసీల్దార్: 203,,డిప్యూటీ ఎంపీడీవో: 176,,గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్: 40,,ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సై: 29,, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 80,,సీనియర్ అకౌంటెంట్: 91లు వున్నాయి.
అర్హతలు:- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

