రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నమంత్రి నారాయణ
ఆరు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్..
అమరావతి: విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో మొత్తం ఆరు అవార్డులు లభించాయి. రాష్ట్రం తరఫున ఈ అవార్డులను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు సాధించిన పురోగతికి ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి.

